సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం నిర్వహించడం కలకలం రేపుతోంది. జనశక్తి నక్సల్స్ కదలికలపై నిఘా వర్గాలు ఆరాతీస్తున్నాయి. జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దుల్లో 8మంది జనశక్తి సాయుధులు, 65 మంది సానుభూతిపరులు సమావేశం నిర్వహించారు. సిరిసిల్లా బార్డర్ పోతురెడ్డిపల్లి ఫారెస్ట్ లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల , కొనరావేపేట్ , ఎల్లారెడ్డి పెట్ , గంభీరావ్ పేట్ , ముస్తాబాద్ కు చెందిన మాజీలతో సమావేశం అయినట్లు సమాచారం.
గత కొంత కాలంగా జనశక్తి నక్సల్స్ సైలెంట్ గా ఉన్నారు. వ్యవస్థాపకులు కూర రాజన్న , కూర అమర్ జనశక్తి దూరంగా ఉంటున్నారు. సిరిసిల్లకు చెందిన మాజీ నక్సల్స్ ని పిలిపించుకుని జనశక్తి సెక్రెటరీ విశ్వనాథ్ మాట్లాడారు. జనశక్తి మీటింగ్ ఫై పోలీసులు సీరియస్ అయ్యారు. మీటింగ్ కి వెళ్లిన మాజీ లను ప్రశ్నిస్తున్నారు.