Saturday, November 23, 2024

పేదలకు ఉచితంగా డయాలసిస్​ సేవలు.. జన్​ ఔషధి యోజనతో ఎంతో మేలు

నిరుపేదలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. అందరి ఆరోగ్యం బాగుండేలా చూడడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రధాని మోదీ అన్నారు. సమాజంలోని అట్టడుగు స్థాయి వారు ఉచితంగా డయాలసిస్ చేయించుకునేలా పథకంలో రూపొందించినట్టు తెలిపారు. తాము తీసుకొచ్చిన ఈ పథకం కింద పేదలు ఇప్పుడు తక్కువ ధరలకు మందులను కూడా కొనుగోలు చేయవచ్చన్నారు. తమ ప్రభుత్వం పేదల కోసం శ్రద్ధ వహిస్తుంది. కేన్సర్, మధుమేహం, టీబీ మొదలైన వ్యాధుల కోసం 800 పైగా మందులు పరిమిత ధరలలో అందుబాటులో ఉన్నాయి అని జన్ ఔషధి దివస్ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు.

జన్ ఔషధి యోజన పథకం లబ్ధిదారుడితో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ పథకం ఎలా ఎలా సహాయపడిందో తెలియజేయాలని కోరారు. ఇంతకుముందు మందులు కొనాలంటే రూ.1500-రూ.1600 అయ్యేది.. కానీ ఇప్పుడు ఈ పథకంతో రూ.250-రూ.300 ఖర్చవుతుందని ఓ లబ్ధిదారు ప్రధానికి చెప్పారు. జన్ ఔషధి కేంద్ర లబ్ధిదారుడితో సంభాషించిన ఆయన జన్ ఔషధి యోజన ప్రయోజనాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తప్పనిసరిగా వ్యాప్తి చేయాలని అన్నారు. వివిధ భాషల్లో కథనాలు, వీడియోలను పంచుకునేలా ప్రజలను ప్రోత్సహించవచ్చని, మధ్యతరగతి వర్గాల ప్రజలు చాలా డబ్బు ఆదా చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని మోడీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement