గత రెండు రోజులుగా కాత్రాలో పలుచోట్ల భూకంపాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ లోని కాత్రా పట్టణంలో శుక్రవారం వేకువజామున 3. 28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. కత్రాకు 62 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.భూమికి దాదాపు 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ పేర్కొంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. ప్రకంపనలు రావడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement