జమ్ముకశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పహల్గాం అటీవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పుష్కరులు హతమయ్యారు. అక్కడ ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహించాయి. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో అశ్రఫ్ మోల్పీ అనే పాత తీవ్రవాది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర మార్గంలో జరిగిన ఎన్కౌంటర్ తమకు అతిపెద్ద విజయమని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement