Friday, November 22, 2024

విశ్వంలో ఏముందో తెలుసా? జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ పంపిన ఫస్ట్​ ఫొటో రిలీజ్​ చేసిన నాసా!

విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాకు నాసా చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను స్పేస్ లోకి పంపింది.  ఇప్పుడా టెలిస్కోప్ తన ఫస్ట్​ ఫొటోని భూమికి పంపింది. దీంతో US ప్రెసిడెంట్ జో బిడెన్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా తీసిన కాస్మోస్ యొక్క మొదటి ఫుల్​ లెంగ్త్​ ఫొటోని ఆవిష్కరించారు. వేలకొద్ది గెలాక్సీలు, బ్లూ, ఆరెంజ్, వైట్ రంగుల్లో ఎన్నో విషయాలు ఈ ఫొటోలో కనిపిస్తున్నాయి.

వైట్​ హౌస్​లో జరిగిన ఓ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడుతూ.. ఈ రోజు చారిత్రాత్మకమైనదన్నారు. మానవాళికి చరిత్రలో ఈ రోజు మరువలేనిదన్నారు. మానవ చరిత్రలో ఈ క్షణం ఎంతో గర్వించదగినదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అన్నారు. విశ్వ చరిత్రలో ఈ రోజు ఓ గొప్ప అధ్యాయమని కొనియాడారు. ఇకపోతే.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇతర ఫొటోలను నాసా, యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా మంగళవారం విడుదల చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement