Tuesday, November 19, 2024

క్రిటికల్ దశలను దాటనున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. ట్వీట్ చేసిన నాసా

NASA పంపిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొన్ని సంక్లిష్టమైన దశలను దాటి వెళ్తోందని, ఇది స్పెస్ కి సంబంధించిన మూలాలను కనుగొనే స్పెషల్ మిషన్‌ కానుందని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా వెల్లడించింది. క్రిస్మస్ రోజున కక్ష్యలోకి పంపిన ఈ టెలిస్కోప్ శక్తివంతమైన అంతరిక్ష అబ్జర్వేటరీ, దాని ఐదు-పొరల సన్ షీల్డ్ ని అన్‌ప్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు. “మేక్ ఆర్ బ్రేక్” మూవ్ మెంట్ ని సాధించే దిశగా ప్రయత్నం చేస్తోందన్నారు. కాగా, ఈ వెబ్ టెలిస్కోప్‌కు అవరోధం కలిగించే టెంపరేచర్లు ఉత్పన్నమైతే దాన్ని సమర్థవంతంగా పనిచేయించడానికి సూపర్ కోల్డ్ టెంపరేచర్లను అందించే వ్యవస్థ ప్రత్యేంగా ఏర్పాటు ఉందన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఔత్సాహికులు ఫాలో అవుతున్న ఈ ఉద్విగ్న క్షణాలపై NASA ట్విట్టర్ ద్వారా రెగ్యులర్ అప్‌డేట్‌లను అందిస్తోంది.

 త్వరలోనే సన్ షీల్డ్ ను దాటడానికి డిప్లాయబుల్ టవర్ అసెంబ్లీ (డిటిఎ)ని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తుందని నాసా ఓ ట్విట్టర్ ద్వారా తెలిపింది. స్పెస్ లో జేమ్స్ వెబ్‌ టెలిస్కోప్ ప్రయోగం ఆరు నెలలు ఉండనుంది. ఇదొక తొలి ప్రయోగం మాత్రమే అని నాసా పేర్కొంది. కాగా, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఒక పెద్ద అబ్జర్వేటరీ లాంటదని, ఏరియన్ లాంచర్ యొక్కనోస్ కోన్ లోపల ఒక చిన్న ప్రదేశంలో అది ప్యాక్ చేసి ఉంటుందని నాసా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement