జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. అయితే అతి వేగం కారణమనుకున్నారు అంతా.. కానీ ఇప్పుడో నిజాన్ని బయటపెట్టాడు ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుడు ఆ వివరాలను తెలియజేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో సోమశేఖరరెడ్డి అనే వ్యక్తి తన కుమారుడితో పాటు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఆయన కుమారుడికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోమశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జరిగిన ఘటనను వివరించారు.
బస్సు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా స్టీరింగ్ పట్టేసిందని తెలిపారు. బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడని, అయితే స్టీరింగ్ తిరగలేదని వివరించారు. దాంతో బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొట్టి వాగులో పడిపోయిందని వెల్లడించారు. బస్సు డ్రైవర్ నీళ్లలో ఊపిరాడక మరణించాడని, తమను స్థానికులు రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నామని సోమశేఖరరెడ్డి వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..