కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య కాంగ్రెస్‌ను కించపరిచే ప్రయత్నమని విమర్శించారు. ఈ కేసులో ఖర్గే నిందితుడు కాదని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని ఈడీకి హామీ ఇచ్చారని జైరాం రమేశ్ గుర్తు చేశారు. అయితే, పార్లమెంట్ సమావేశాల జరగని సమయంలో విచారణకు హాజరవుతారని చెప్పగా.. ఈడీ ఇందుకు అంగీకరించలేదు. పార్లమెంట్ సభ్యులను వేధింపుల నుంచి కాపాడాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు జైరాం రమేశ్ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ స్పీకర్, ప్రిసైడింగ్ అధికారిని అవమానించడం ఆపాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement