మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ మృతి చెందాడు. జైన్ వయసు 26సంవత్సరాలు. సెరెబ్రల్ పల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు జైన్. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరికీ మెయిల్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ మైక్రోసాఫ్ట్ మెయిల్ చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. సత్య నాదెళ్ల కుమారుడు జైన్.. పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. చిన్నప్పటి నుంచి వీల్ చైర్‌కే జైన్ అంకితమయ్యాడు. జైన్ నడవలేడు, చూడలేడు, సరిగా మాట్లాడలేడు. ఇక ఈ బాధను భరించలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ నాదెళ్ల తిరిగారు కానీ ఎలాంటి ఫలితం లేదు. ఒకవైపు తన కొడుకు పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ , ప్రపంచాన్ని ముందడుగు వేయించాలనే తపనతో నాదెళ్ల ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నారు. కానీ చివరికి జైన్ కన్నుమూయడం బాధాకర విషయం.
Advertisement
తాజా వార్తలు
Advertisement