Saturday, November 23, 2024

Big Story: జాతీయ పార్టీకి జై.. దేశంలో కేసీఆర్​, బీఆర్​ఎస్ జోష్​!

2001లో ఉద్యమపార్టీగా మొదలైన టీఆర్​ఎస్.. తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించింది టీఆర్​ఎస్​. యావత్​ తెలంగాణ ప్రజలను ఏకం చేయడంలో కేసీఆర్​ తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ అందరినీ ఏకతాటిమీదికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బొంతపురుగునైనా ముద్దాడుతా అన్న కేసీఆర్​ మాటలు ఆయనలో ఉన్న నిబద్ధతను తెలియజేశాయి.

దీంతో అప్పటిదాకా ఉన్న వ్యతిరేకులు కూడా తెలంగాణకు సానుకూలంగా మారారు. ఇట్లా ఎన్నో ఉద్యమాల తర్వాత 2014లో పార్లమెంట్​లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే అంతకుముందు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్​.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ​ తానే సీఎంగా ఉంటానని ప్రజల్లోకి వెళ్లారు. ఆయన మీద నమ్మకంతో ప్రజలు అవకాశం ఇచ్చి, అధికారం కట్టబెట్టారు. అయితే.. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్​ మోసం చేశారన్న ఆరోపణలువచ్చాయి. కానీ, తాను పోరాడి తెచ్చిన తెలంగాణను ఆగం కానియ్యను అని, బంగారు తెలంగాణ చేసేదాకా నిద్రపోను అని కేసీఆర్​ చెప్పడం గమనార్హం.

ఇక.. ఇప్పుడు ఎనిమిదేండ్ల టీఆర్​ఎస్​ పాలన తర్వాత తెలంగాణ దేశంలోనే గొప్ప పరిపాలనా దక్షతతో ముందుకు వెళ్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించింది. కేంద్రం సహకరించకున్నా, ఫండ్స్​ ఇవ్వకున్నా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేపట్టి ఇప్పుడు దేశంల టాప్​ ప్లేస్​లో ఉంది తెలంగాణ. ఇదే తరహా దేశాన్ని డెవలప్​ చేయాలని, ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ మోడల్​ అభివృద్ధి సంక్షేమం జరగాలన్న ఆలోచనతో కేసీఆర్​ టీఆర్​ఎస్​ పార్టీని భారత్​ రాష్ట్ర సమితిగా మార్చారు.

విజయదశమి శుభ సందర్భంగా బీఆర్​ఎస్​ పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన లీగల్​ అంశాలను ఆ పార్టీ టీమ్​ భారత ఎన్నికల సంఘం ముందు ప్రవేశపెట్టి అన్నిటిని సార్టవుట్​ చేయనుంది. దీంతో మరో మూడు రోజుల నుంచి వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. దీంతో హైదరాబద్​తో పాటు, తెలంగాణ జిల్లాల్లోనూ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ కేసీఆర్​ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రత్యేక బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి అభిమానాన్ని చాటుకుంటూ బీఆర్​ఎస్​ పార్టీని స్వాగతిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement