Wednesday, November 20, 2024

Jagg Reddy: చంద్రబాబును తిట్టడం బాధగా ఉంది: టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఏపీలో అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన అవమానంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు సరి కాదన్నారు. కొడాలి నాని మాటలకు చప్పట్లు కొట్టోచ్చు కానీ అది మంచిది కాదన్నారు. కొడాలి నాని మాటలు మార్చుకుంటే బెటర్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందన్నారు. కొడాలి నాని మాటలు మార్చుకుంటే మంచిదని చురకలంటించారు.

రోజా కూడా ఎక్కువ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు కామన్  అన్న జగ్గారెడ్డి.. మీడియాలో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలు సరి కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాల నాయకులు కలిసి పని చేసే వాళ్ళం అని గుర్తు చేశారు. ప్రతిపక్షం సమస్యలు లేవనెత్తిన.. హుందా తనంతో పని చేశారన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుని ఓ మాట అంటే… రికార్డ్ నుండి తొలగించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. జగన్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు మీద విమర్శలు చేయడం చేశానని చెప్పారు.

మా గొంతు కెసిఆర్ నొక్కేస్తూ ఉన్నా.. వ్యక్తిగత దూషణలు చేయడం లేదన్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు ..ఏపీలో దూషణలు కూడా చూడలేదన్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం చాలా మంది నాయకులకు ఇబ్బందిగానే అనిపించిందన్నారు. రాజకీయ కుట్రలు… కుతంత్రాలు ఉంటాయన్నారు. కానీ చంద్రబాబుకి వయసు రీత్యా అయినా..గౌరవం ఇవ్వాల్సిందన్నారు. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని సూచించారు. అదే మాట జగన్ కానీ.. నాని గానీ అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయలన్నారు. స్పీకర్ కుర్చీ సీఎం ఇచ్చినా… ప్రతిపక్ష నాయకుడి కుటుంబంపై దూషణలు చేస్తుంటే చూస్తూ ఉన్నాడని మండిపడ్డారు. స్పీకర్ గా తమ్మినేని అన్ ఫిట్ అని వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పార్టీకి సంబందం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తిట్టేటప్పుడు… జగన్ నవ్వు దేనికి సంకేతం అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బాబునీ గెలిపిస్తే… నీ పరిస్థితి ఎంటి జగన్ అని అడిగారు. చంద్రబాబు తనను గుర్తు పట్టే పరిచయం కూడా లేదన్న జగ్గారెడ్డి… ఓ సీనియర్ నాయకుడికి అలా అవమానించడం సరికాదన్నారు.  జగన్ పాలన ఇలాగే కొనసాగిస్తే.. రివర్స్ అవుతుందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యం లేని పాలన అనిపిస్తుందన్నారు. అసెంబ్లీ హల్ లెక్క లేదు… గొర్రెను కభేలాలకు పంపినట్టు ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల ప్రవర్తన సమాజానికి తప్పుడు సంకేతం పంపారన్నారు. రాజకీయంగా టార్గెట్ చేశారని కాదు..ఫ్యామిలీని తిట్టారని చంద్రబాబు ఏడ్చారని అభిప్రాయపడ్డారు. ఏడుపు అపుకునే ప్రయత్నం చేసినా.. ఆగలేదన్నారు. కుటుంబ సభ్యులపై విమర్శలు వస్తే… ఎవరు కంట్రోల్ చేసుకోలేరన్నారు. టిడిపి వాళ్ళు కూడా మీ కుటుంబం నీ అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏపీతో తనకు కూడా అనుబందం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాని జగ్గారెడ్డి చెప్పారు. ఆంధ్రా రాజకీయం ప్రశాంతంగా జరిగేలా జగన్ చొరవ తీసుకోవాలన్నారు. పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండని సూచించారు. చంద్రబాబుని అలా తిట్టడం వ్యక్తిగతంగా తనకు చాలా బాద అనిపించిందని చెప్పారు.

- Advertisement -

నా మీద ఏదైనా మాట్లాడితే… ఇప్పుడు మర్యాదగా మాట్లాడుతున్నా అని అన్నారు. మీరు తేడాగా స్పందిస్తే… మీ అందరి గురించి నాకు తెలుసన్నారు. బీజేపీ కూడా వ్యక్తి గత దూషణల రాజకీయం మొదలుపెట్టింది. కాంగ్రెస్ లో అలాంటి కల్చర్ లేదు. అవతలి వాడు మమ్మల్ని టెంప్ట్ చేస్తేనే అంటామని అన్నారు. కానీ మేము ఎవరిని కావాలని వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు. కెసిఆర్ మమ్మల్ని సన్నాసి అంటే..మేము అంటాం, కానీ…మేము అలా అనం అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement