Tuesday, November 19, 2024

Breaking: కాంగ్రెస్ లో కోల్డ్ వార్.. సీనియర్ల ప్రత్యేక సమావేశం

కాంగ్రెస్‌ పార్టీని తాము ఏవిధంగానూ వ్యతిరేకించడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఆదేశాలను తప్పక పాటిస్తామని తెలిపారు. హోటల్ ఆశోకలో ఇవాళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. తమ సమస్యలు అధిష్ఠానానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఈ భేటీ పూర్తిగా తమ వ్యక్తిగతం అని పేర్కొన్నారు. మిగతా నేతలు ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. సమావేశం వద్దకు మానవతారాయ్‌, అద్దంకి దయాకర్‌, బెల్లయ్య నాయక్‌లు కూడా వచ్చారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. దీంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. దమ్ముంటే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని రేవంత్ కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సీనియర్ నేత వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. తన కూతురు కోసమే హరీశ్ రావును వీహెచ్ కలిశారని తెలిపారు. మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎవరు?అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోనియా, రాహులే అంతిమ నిర్ణయం తీసుకుంటారని తలిపారు. రేవంత్ ఒక్కడే పార్టీని అధికారంలోకి ఎలా తీసుకొస్తాడని నిలదీశారు. అంతా కలిస్తేనే ఏమైనా చేయొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై అభ్యర్థిని పెట్టి గెలిపించు.. అప్పుడే నువ్వే హీరో అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్తున్నాడని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement