ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌లను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు తీర్పును వచ్చేనెల 15కి వాయిదా వేసింది.
కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ జూన్ 4న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌పై బయట ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే సీబీఐ వాదనలను కూడా విన్న కోర్టు ఈ విచారణను వాయిదా వేసింది.