సుఖేశ్ చంద్ర శేఖర్ మనీ లాండరింగ్ కేసు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. కారణం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండైజ్ అతనితో రిలేషన్ లో ఉండటం. అంతేకాదు జాక్వెలిన్ కి రూ. 10కోట్ల విలువైన బహుమతులను సుఖేశ్ ఇచ్చాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా నడుస్తుందనే టాక్ ఉంది. దాంతో పలువురు నిర్మాతలు వారి లవ్ స్టోరీని క్యాష్ చేసుకోనున్నారట. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుఖేశ్ చంద్ర శేఖర్ ల మధ్య ఉన్న లవ్ స్టోరీని వెబ్ సిరీస్ గా తీయాలని భావిస్తున్నారని సమాచారం.
అయితే ఇటీవల ఓటీటీ లలో ఇలాంటే కాంట్రవర్సీ కథలే హిట్ కొడుతున్నాయి. దీంతో ఈ స్టోరీని వెబ్ సిరీస్ గానీ సినిమాగా గానీ తీయాలని పలువురు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే కథ ను కూడా సిద్ధం చేశారని సమాచారం. లీడ్ రోల్స్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుఖేశ్ చంద్ర శేఖర్ పాత్రలలో ఎవరిని తీసుకోవాలనే అంశం పై చర్చిస్తున్నారని టాక్. మరి వారి లవ్ స్టోరీని తెరపైకి ఎక్కించేందుకు జాక్వెలిన్ ఒప్పుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..