ఇంటర్ పరీక్షలు ముగిసి, ఆన్సర్ షీట్ల వ్యాల్యూయేషన్ జరగనున్న నేపథ్యంలో ఆ ప్రక్రియలో పాల్గొనే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల డ్యూటీ, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అధ్యాపకులు.. సిబ్బంది పారితోషకాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక జవాబు పత్రం వ్యాల్యూయేషన్‌కు 18.93 రూపాయల నుండి 23 రూపాయల 66పైసలకు పెంచారు. అదేవిధంగా రూ.641 నుండి రూ.800 వరకు అన్ని ప్రక్రియలకు 25% పారితోషికం పెంచారు.
దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి, విద్యా శాఖ సెక్రెటరీ సందీప్ సల్తానియాకి, ఇంటర్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ కు ఇంటర్ విద్య JAC ఛైర్మెన్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉద్యోగులంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. మూల్యాంకన కేంద్రాల్లో మరింత బాధ్యతతో పనిచేయాలన్నారు.