పర్యావరణ పరిరక్షణ కోసం తన సంస్థనే విరాళంగా ఇచ్చారు అమెరికాకు చెందిన ఇవాన్ షూయినార్డ్ అనే వ్యాపారవేత్త. ఇవాన్ షూయినార్డ్ కు పెటగోనియా అనే అవుట్ డోర్ దుస్తుల వ్యాపారం ఉంది. 50 ఏళ్ల కిందట ఆయన పెటగోనియా సంస్థను స్థాపించి, ఆ కంపెనీని ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడా కంపెనీపై వచ్చే లాభాలన్నింటిని పర్యావరణ కార్యక్రమాలకు, వాతావరణ కాలుష్యంపై పోరాడే సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇవాన్ షూయినార్డ్, ఆయన భార్య, ఇద్దరు సంతానం కూడా పెటగోనియా కంపెనీలోని తమ వాటాలను విరాళంగా అందించాలని నిర్ణయించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం…. పెటగోనియా కంపెనీ మార్కెట్ విలువ రూ.24 వేల కోట్లు ఉంటుందని అంచనా. తన కంపెనీని విరాళంగా ఇస్తున్న నేపథ్యంలో ఈ పుడమి ఒక్కటే మా వాటాదారు అంటూ ఇవాన్ షూయినార్డ్ లేఖ రాశారు. అందుబాటులో ఉన్న వనరులతో చేయగలిగినంత చేస్తే, ఈ అభివృద్ధి చెందుతున్న గ్రహం (భూమి) తనతోపాటు మనందరినీ కూడా ముందుకు తీసుకెళుతుంది. మనకు ఏదైనా ఆశ ఉందంటే ఇదొక్కటే అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement