లడఖ్ లో 17,500అడుగుల ఎత్తులో 65పుషప్ లు చేసి ..యువతను ఆశ్చర్యపరిడారు ఐటీబీ కమాండర్. ఆయన వయసు 55. రతన్ సింగ్ సోనాల్ మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 65 పుషప్‌లు చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతటి చలిలో అక్కడ ఉండటమే కష్టమంటే.. ఓ ఆర్మీ కమాండర్ తన పనితో అందరనీ ఆశ్చర్యపరిచాడు. గడ్డకట్టే చలిలో అది కూడా 55ఏళ్ల వయసులో 60పుష్ అప్స్ చేయడం మామూలు విషయం కాదు.. Indo-Tibetan Police (ITB) వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ సమయంలో హిమాలయ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంటుంది. ఇక్కడ కూడా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ (IMD) ప్రకారం, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రాబోయే కొద్ది రోజులు మంచు ,వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్కైమెట్‌వెదర్ ప్రకారం, జమ్మూ మరియు కాశ్మీర్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర పాకిస్తాన్‌పై పశ్చిమ డిస్ట్రబెన్స్ కొనసాగుతోంది. దీని కారణంగా మరింత మంచు కురిసే అవకాశం ఉంది. ఇంత ప్రతికూల వాతావరణంలో కూడా సైనికులు భారత సరిహద్దును రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. కమాండెంట్ రతన్ సింగ్ పుషప్‌లు చేయడం చూసి జనం ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..