ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుంచి 46 మంది వలసదారులతో బోట్ ఇటలీ బయలు దేరింది. బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న బోటు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37 మంది గల్లంతయ్యారు. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. బయటపడిన వారు ఉప-సహారా ఆఫ్రికాకు చెందిన వారు. వీరు మరో నౌక ద్వారా ప్రాణాలతో బయటపడినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది