Tuesday, November 19, 2024

Something Special | రేపు పొద్దుపోవ‌డం ​ కష్టమే.. అతిపెద్ద పగటిపూట ఉంటుందన్న సైంటిస్టులు

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను రేపు (బుధవారం) ఎక్స్​పీరియన్స్​ చేయబోతున్నాం. వినడానికి ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా.. జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా మనం రోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్‌ 21వ తేదీన మాత్రం (బుధవారం) 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉండబోతున్నట్టు స్పష్టం చేస్తున్నారు.

చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు.. భూమి చిన్నగా ఉండి, దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఏటా జూన్ 20వ తేదీన లేదా 21వ తేదీన కానీ, డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే లండన్​, అమెరికా, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం.

ఈ నెల 21వ తేదీన భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్​లో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెకన్ల తేడాతో సూర్యాస్తమయం ఉంటుంది.. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement