కర్నాటక డిప్యూటీ సీఎం డీకే కుతంత్రం
మరో మంత్రి ఎంబీ పాటిల్ ప్రత్యేక దృష్టి
పెద్ద ఎత్తున ఇన్సెంటివ్‌ల ఆఫర్
అనేక కంపెనీలకు లేఖలు
హైదరాబాద్ టూర్‌లో డీకే రహస్య చర్చలు
తీవ్ర ఆందోళనలో హైదరాబాద్ టెకీలు
ఆంగ్ల, కన్నడ పత్రికల్లో కథనాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఒకవైపు తెలంగాణ యావత్తు అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో నిమగ్నమైన వేళ! చాపకింద నీరులా హైదరాబాద్ పరిధిలోని జాతీయ, అంత ర్జాతీయ కంపెనీల తరలింపునకు ప్రయత్నాలు జరుగుతు న్నాయా? భారీ ఇన్సెంటివ్‌లు ఇస్తామంటూ… ఆయా కంపెనీలకు వల విసురుతున్నారా?? ఇందుకు అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం గత పదేండ్లలో తన ప్రభను కోల్పో వడంతో పాటు- దేశంలోని మెట్రో నగరాల్లోనే హైదరాబాద్ ముందంజలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే అదునుగా ఇక్కడి పరిశ్రమలు, కంపెనీలకు గాలం వేసి బెంగళూరుకు తరలించడంపై దృష్టి సారించినట్లు-గా తెలుస్తున్నది. ఈ మేరకు తాజాగా కర్ణాటక లోని పలు కన్నడనాట ఆంగ్ల, స్థానిక పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర డిప్యూటీ- సీఎం డీకే శివకుమార్‌తో పాటు- పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఫ్యాక్స్‌కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్లు-గా ఆ కథనాల్లో పేర్కొనడం గమనార్హం.
పత్రికా కథనాలతో పాటు- లేఖల అంశం పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గత పది సంవత్స రాల్లో హైదరాబాద్ మహా నగరం ఐటీ-, ఐటీ-ఈఎస్‌తో పాటు- పారిశ్రామికంగానూ ఊహించనిరీతిలో దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు-ను సరళీకృతం చేస్తూ అమలు చేస్తున్న టీ-ఎస్ ఐపాస్‌తో బడా బడా కంపెనీలు సులువుగా ఇక్కడ తమ పరిశ్రమలను ఏర్పాటు- చేసుకునే అవకాశం
వచ్చింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఎర్ర తివాచీ పరిచి వారికి కావాల్సిన వసతులను కల్పించింది. 24 గంటల కరెంటు-, పుష్కలమైన నీటి సరఫరా కల్పించింది. ఇంకోవైపు ఐటీ- రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ- కంపెనీలు, డాటా సెంటర్లు సైతం నగరం చుట్టు-పక్కల కొలువుదీరాయి. అమెజాన్, మైక్రోసాప్ట్n, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు- చేసుకున్నాయి.
వీటితో పాటు- ఫాక్స్‌కాన్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కంపెనీలు, వెల్‌స్పన్, కిటెక్స్, కటేరా, వంటి ఇతర ఉత్పత్తి రంగాలకు చెందిన బడా కంపెనీలు కూడా వేల కోట్ల పెట్టు-బడులతో నగర శివారులో కొలువుదీరాయి. హైదరాబాద్ చుట్టు-పక్కలనే కాకుండా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కు, దీంతో అనతి కాలంలోనే తెలంగాణకు లక్షల కోట్ల పెట్టు-బడులు వచ్చి యువతకు లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ… వేల కోట్లతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించింది. విస్తారమైన రహదారులు… ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, తీగల వంతెనలు ఇలా తక్కువ సమయంలోనే భారీ ఎత్తున అంతర్జాతీయ స్థాయి రహదారుల వ్యవస్థ వచ్చింది. దీంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలతో హైదరాబాద్ ఐటీ- రంగం గణనీయ వృద్ధి సాధించింది. గత పదేండ్లలో ఐటీ- ఎగుమతులు సుమారు రూ.53వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయి. దీంతో పాటు- ఐటీ- ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల పైచిలుకు నుంచి దాదాపు పది లక్షలకు పెరిగింది. ఇలా ఐటీ- రంగంలో బెంగళూరు దరిదాపుల్లోకి చేరింది.
పదేండ్లలో ప్రభ కోల్పోయిన బెంగళూరు…
హైదరాబాద్ ఒకవైపు ఐటీ-, ఐటీ-ఈఎస్, పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతుండగా… బెంగళూరు నగరం పదేండ్లలో తన ప్రభను కోల్పోయింది. ఐటీ- రంగంలో స్వల్ప వృద్ధితోనే ముందుకుపోయింది. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్ నరకం, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారుల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో తీవ్రమైన కరెంటు- సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్‌షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవిష్ నరేష్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్ పై బెంగళూరు మౌలిక వసతులపై తీవ్రస్థాయిలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వసతులను ప్రశంసించారు. ముఖ్యంగా కొన్నిరోజుల కిందట బెంగళూరు ఏర్పాటు- కావాల్సిన కీన్స్ కంపెనీ అక్కడి మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో పాటు- ప్రభుత్వ విధానాలు కూడా సరిగ్గా లేవని హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. ఈ మేరకు కీన్స్ సీఈవో రాజేశ్ శర్మ బహిరంగంగానే కర్ణాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా సామాజిక మాద్యమాల్లో సుదీర్ఘ కాలంగా హైదరాబాద్-బెంగళూరు వసతులను పోలుస్తూ… కర్ణాటక ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ప్రజలు, -టె-కీలు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలూ అనేకం. ఇలా… బెంగళూరు నగరానికి హైదరాబాద్ ధీటు-గా ఎదగడంతో పాటు- తమ ఐటీ- రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బ పడుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది.
ఎన్నికలు అదునుగా హైదరాబాద్‌పై గురి…
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకియ గత నెల, రెండు నెలలుగా ఊపందుకుంది. రాజకీయ పార్టీలతో పాటు- బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికలపై దృష్టిసారించాయి. ఇదే అదునుగా ఇక్కడి నుంచి పరిశ్రమల్ని బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు-గా అర్థమవుతుంది. ఆ రాష్ట్ర డిప్యూటీ- సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ గత కొంతకాలంగా ఇదే పని మీద ఉన్నట్లు- కన్నడనాట పత్రికలు అనేక కథనాలు ప్రచురిస్తున్నాయి. బెంగళూరుకు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఇద్దరు మంత్రులు అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాసినట్లు-గా ఆ కథనాల్లో పేర్కొన్నారు. బెంగళూరు నగరానికి వస్తే అనేక ఇన్సెంటివ్‌లు ఇస్తామంటూ వారికి ఆశ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఫాక్స్‌కాన్ కంపెనీకి కూడా లేఖ రాసినట్లు- సామాజిక మాద్యమాల్లో లేఖ వైరల్ అయింది. ప్రస్తుతానికి తెరపై ఫాక్స్‌కాన్ లేఖ కనిపిస్తున్నా… ఇంకెన్ని కంపెనీలకు డీకే, పాటిల్ లేఖ రాశారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ మంత్రాంగం మొత్తం డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్లు- తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాకున ఇటీ-వల ఆయన హైదరాబాద్‌కు వచ్చినపుడు అంతర్గతంగా ఈ వ్యవహారాలు చక్కబెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా సామాజిక మాద్యమాల్లో ఈ అంశాలన్నీ వైరల్ అవుతుండటం చూసి హైదరాబాద్ -టె-కీల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలోనూ ఫాక్స్‌కాన్‌పై కుట్ర…
కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకునేందుకు గతంలోనూ ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి ఒకటిన టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్‌లీ యూను ఆహ్వానించింది. ఆయన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసి త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టు-బడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది జరిగిన మరుసటి రోజు నుంచే ఫాక్స్‌కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టు-బడులు పెట్టనుందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై… ఫాక్స్‌కాన్‌తో సీఈవోతో సంప్రదింపులు జరిగింది. అనంతరం మార్చి ఆరో తేదీన ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్‌లీ యూ అధికారికంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తూ.. తాము తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని సామాజిక మాద్యమాల్లో జరిగిన విష ప్రచారానికి తెరదింపారు.