Tuesday, November 26, 2024

జైపూర్ లో – ప్ర‌పంచంలోనే మూడ‌వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం

జైపూర్-ఢిల్లీ బైపాస్ మార్గంలో ప్ర‌పంచంలోనే మూడ‌వ అతిపెద్ద క్రికెట్ స్టేడియంని నిర్మించ‌నున్నారు. ఈ స్టేడియం రాజ‌స్థాన్ లోని జైపూర్ లో ఏర్పాటు కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి జైషా శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఇందుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు ఆర్సీఏ ప్రెసిడెంట్ వైభవ్ గెహ్లాట్ తెలిపారు. దేశంలో రెండో అతిపెద్ద, ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టేడియం ఇది అవుతుందన్నారు. 75,000 మంది ప్రేక్షకులు కూర్చునే వసతితో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలోని 10 పెద్ద క్రికెట్ మైదానాల్లో 7 భారత్ లోనే ఉన్నాట్టు ఆర్సీయే తెలిపింది. గత పదేళ్లలో ఎన్నో వనరులు సమకూర్చుకున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ సందర్భంగా తెలిపారు. నేడు ప్రపంచంలో బీసీసీఐ ప్రముఖ క్రికెట్ బోర్డుగా ఉన్నట్టు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement