కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో వేడకలు జరిపే ముందు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కార్యక్రమం కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం అన్నారు. ఓ మీడియా సంస్థతో ఇవ్వాల (శనివారం) మాట్లాడిన ఆయన పలు అంశాలపై కేంద్రానికి, అమిత్‌షాకు ప్రశ్నలు సంధించారు.
ఇద్దరు సీఎంలతో కేంద్ర హోం మంత్రి ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి పోటా పోటీగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాస్తవానికి, రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజు ఇది. కానీ, కొందరేమో విమోచనం అంటున్నారు, ఇంకొంతమంది విలీనం అంటున్నారని.. వారికి రాజకీయం చేయడం మినహా స్పష్టమైన విధానం లేదన్నారు మంత్రి కేటీఆర్.