Friday, November 22, 2024

Big Breaking | నిండుకుండ‌లా మూసీ ప్రాజెక్టు.. పరివాహక ప్రాంత‌ ప్రజలకు హెచ్చ‌రిక‌

సూర్యాపేట రూరల్, ప్రభ న్యూస్: వాన‌లు కుర‌వ‌నే లేదు.. అప్పుడే మూసీ ప్రాజెక్టు నిండుకుండ‌ను త‌ల‌పిస్తోంది. ఎగువ నుండి పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లోలు వస్తున్నందున ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమ‌ట్టానికి చేరుకుంది. దీంతో ఎప్పుడైనా గేట్లు ఓపెన్ చేసే అవ‌కాశం ఉంద‌ని, ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

ఇన్ ఫ్లో ఆధారంగా మూసీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నందున సూర్యాపేటతో పాటు ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నీటిపారుద‌ల శాఖ ఏఈ బద్రునాయక్ చెప్పారు. సూర్యాపేట మండలం రత్నాపురం, రామవరం, టేకుమట్ల తదితర గ్రామాలు పెన్‌పహాడ్ మండలం అన్నాజపురం, అనంతారం, దోసపహాడ్ తదితర గ్రామాలు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల, దాచారం, గంగపాలెం తదితర గ్రామాలు కేతేపల్లి మండలం బొప్పారం, చీకటిగూడెం, కొత్తపేట్, భీమారం తదితర గ్రామాలు, వేములపల్లి మండలం ఆమన్ గల్, లక్ష్మీదేవి గూడెం, రావులపెంట తదితర గ్రామాలు, మాడుగులపల్లి మండలం తడ్కమల్ల, నర్సింహులగూడ, తక్కేల్లపహాడ్ తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మానవులు, పశువులు వాగులోకి దిగవద్దని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement