Saturday, November 23, 2024

Letter for Modi: పెన్సిల్‌, ర‌బ్బ‌ర్ కొనాల‌న్నా క‌ష్ట‌మైతాంది.. మోదీకి ఓ చిన్నారి లేఖ‌!

‘‘ప్ర‌ధాని మోదీ తాత‌కు న‌మ‌స్తే.. నా పేరు కీర్ది దూబే. నేను ప్ర‌స్తుతం 1వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నా.. ఈ మ‌ధ్య మీరు తీసుకొచ్చిన జీఎస్టీ వ‌ల్ల నాకైతే మ‌స్త్ ఇబ్బంది అయితాంది. క‌నీసం పెన్సిల్‌, ర‌బ్బ‌ర్ కూడా కొనుక్కోలేక‌పోతున్నా’’ అంటూ ఓ చిన్నారి ప్రధాని మోదీకి రాసిన లెటర్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ లెటర్​లో చిన్నారి ఏం రాసిందో చదువి తెలుసుకుందాం..

‌– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

మోదీ తాతా.. కనీసం పెన్సిల్‌, రబ్బర్‌ కూడా కొనలేకపోతున్నా.. అవికూడా చాలా కాస్ట్​లీ అయ్యాయని ఒకటవ తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1వ తరగతి చదువుతోంది. ఆమె పెన్సిల్‌, రబ్బర్‌ను క్లాస్‌లో చోరీ చేస్తున్నారు. దీంతో కొత్త పెన్సిల్‌ కొనమని తల్లిని అడుగుతుంటే ఆమె ఎందుకు పోగొట్టుకున్నవని మందిలిస్తోంది.. ఇది రోజూ జరిగే తంతుగా మారింది. కాగా, ఆదివారం ఆ చిన్నారీ, మ్యాగీ ప్యాకెట్‌ కొనేందుకు ఐదు రుపాయలతో షాప్‌కు వెళ్లింది. మ్యాగీ ప్యాకెట్‌ ధర ఏడు రూపాయలు పెరిగినట్లు షాప్‌ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ పాప నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది. కొత్త పెన్సిల్‌ కోసం మరోసారి మారం చేయగా తల్లి మందలించింది. టేబుల్స్‌ రాయమని సీరియస్​గా చెబుతుంది.

అయితే.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకున్న ఆ బాలిక ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి లేఖ రాసింది. ‘ప్రధానమంత్రీ జీ.. నా పేరు కీర్తి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్, ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేను పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది. నేను ఏమి చేయాలి? ఇతర విద్యార్థులు నా పెన్సిల్‌ను దొంగిలించారు’ అని హిందీలో రాసింది.

మరోవైపు న్యాయవాది అయిన బాలిక తండ్రి విశాల్ దూబే, ధరల పెరుగుదలపై పాప ఆవేదనను అర్థం చేసుకున్నారు. ప్రధాని మోదీకి తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి సోమవారం రిజిస్టర్‌ పోస్ట్ చేశారు. దీంతో ఈ లేఖ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా, ధరల పెరుగుదలపై విపక్షాలు పార్లమెంట్‌లో గళమెత్తుతున్న తరుణంలో ప్రధాని మెదీకి ఆ చిన్నారి ఈ మేరకు లేఖ రాయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement