భారతదేశంలో రాజకీయాలకు అవసరమైన అన్ని సాధనాలను బిజెపి..ఆర్ ఎస్ ఎస్ నియంత్రిస్తున్నాయని చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కాగా 10 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో ‘మొహబ్బత్ కీ దుకాన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ లో రాజకీయ వాతావరణం క్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలను బెదిరిస్తున్నారని, ఏజెన్సీలను ప్రజలపై ప్రయోగిస్తున్నారని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్ లో ఒక రకంగా రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం కూడా చాలా కష్టంగా మారిందని చెప్పారు.బీజేపీ ప్రజలను బెదిరిస్తున్నదని, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలతో మమేకం కావడానికి అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ-ఆరెస్సెస్ నియంత్రిస్తుస్తోందని అందుకే ‘భారత్ జోడో యాత్ర ప్రారంభమైందని చెప్పారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యాప్తి చేస్తున్న విద్వేషాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. మొహబ్బత్ కీ దుకాన్’సయీద్ ఆలోచనపై రాహుల్ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో తమతో మనుషులే నడవలేదని, ప్రజల ప్రేమ కూడా నడిచిందని అన్నారు. అప్పుడే ప్రేమ దుకాణం తెరవాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. భారత్ జోడో యాత్ర ప్రేమ, గౌరవం, హాస్య స్ఫూర్తిని నింపింది. చరిత్రను పరిశీలిస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురుతో సహా ఆధ్యాత్మిక నాయకులందరూ ఒకే విధంగా దేశాన్ని ఏకం చేశారు అని రాహుల్ గాంధీ అన్నారు. భారీ వక్రీకరణ ఉందని చెబుతూ.. వాస్తవానికి దూరంగా ఉన్న రాజకీయ కథనాన్ని ప్రమోట్ చేస్తూ మీడియాలో చూపిస్తుంది అసలైన భారతదేశం కాదని అన్నారు. ఇలాంటి విషయాలను ప్రమోట్ చేయడం కేవలం మీడియా ప్రయోజనాల కోసమేనని అన్నారు. బీజేపీకి ఐటీ సహకరిస్తుందని ఈ ప్రయాణంలో తనకు స్పష్టంగా అర్థమైందని రాహుల్ గాంధీ అన్నారు. కాబట్టి మీడియాలో కనిపించేవన్నీ నిజాలని అనుకోవద్దని ఆయన సూచించారు. భారత్ అంటే మీడియా చూపించేది కాదు. మీడియా ఒక నిర్దిష్ట కథనాన్ని చూపించడానికి ఇష్టపడుతుంది. వాస్తవానికి భారత్ లో జరుగుతుంది కాదని రాజకీయ కథనాన్ని ప్రమోట్ చేయడానికే అది ఇష్టపడుతోందన్నారు.