ఇబ్రహీంపట్నం (ప్రభన్యూస్): ఒక వైపు భగ భగ మండే ఎండలు.. మరోవైపు చల్లని గాలి విస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటూ ఆహ్లాదాన్ని పంచుతూన్న ప్రకృతి… మండు వేసవిలోనూ ప్రకృతి అందాలు మనసుకు ఆహ్లాదాన్ని పంఉతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలు పెరిగి పెద్దవై ప్రస్తుతం పూలు పూసి చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఎర్రని పూలతో రోడ్లకే అందాన్ని తెస్తున్నాయి. ఎండలు మండుతున్నా ఎర్రని పూలు వికసిస్తూ ప్రకృతి రమణీయతను చాటుతున్నాయి. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలన్ తండ నుండి ఎలిమినేడు, తిమ్మాపూర్ వైపుకు వెళ్లే రోడ్ల పక్కన ఉన్న చెట్లు పూలు పూసి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
ఈ దారి పూలదారి.. ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement