Saturday, November 23, 2024

Gaganyaan: గగన్​యాన్​లో మరో కీలక ఘట్టం పూర్తి.. పారాచూట్​ ఎయిర్​ డ్రాప్​ టెస్ట్​ సక్సెస్​!

భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒక రోజు తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్​కి సంబంధించిన ఓ కీలక పరీక్ష ద్వారా మరో డెవలప్​మెంట్​ని సాధించింది. గగన్‌యాన్ భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని వచ్చే ఏడాది చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

నిన్న (శనివారం) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC)లో ఓ కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని బాబినా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (BFFR) నుంచి ఈ ప్రయోగం చేశారు. ఇస్రో సిబ్బంది మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టమ్ యొక్క “ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ (IMAT)” నిర్వహించి సక్సెస్​ అయ్యారు. ఈ పరీక్ష భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఎంతో కీలకం అని తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి భూమి నుంచి ఆకాశానికి మొదటి వ్యోమగామి మిషన్‌ను ప్రారంభించేందుకు ఇస్రో ఒక్కో ప్రయోగాన్ని సక్సెస్​ చేసుకుంటూ వస్తోంది.

క్రూ మాడ్యూల్ బరువుకు తగ్గ 5-టన్నుల డమ్మీ బరువుని 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళం యొక్క IL-76 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా కిందికి జారవిడిచారు. రెండు చిన్న పైరో-ఆధారిత మోర్టార్-నియోగించిన పైలట్ పారాచూట్‌లు, ఆపై ప్రధాన పారాచూట్‌లను లాగారు. గగన్​యాన్​ క్రూ మాడ్యూల్ కోసం పారాచూట్ సిస్టమ్ మొత్తం 10 పారాచూట్‌లను కలిగి ఉంటుంది. విమానంలో పారాచూట్ సీక్వెన్స్ 2 సంఖ్యల అపెక్స్ కవర్ సెపరేషన్ పారాచూట్‌ల (క్రూ మాడ్యూల్ పారాచూట్ కంపార్ట్ మెంట్‌కు రక్షణ కవర్) విస్తరణతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత వేగాన్ని స్థిరీకరించడానికి , తగ్గించడానికి 2 నంబర్ల డ్రోగ్ పారాచూట్ విస్తరణ జరుగుతుంది అని ఇస్రో అధికారులు చెప్పారు.

వ్యోమగాములను భూమిపైకి దింపేందుకు మూడు ప్రధాన పారాచూట్‌లలో రెండు సరిపోతాయని, మూడవది అనవసరమని భారత అంతరిక్ష సంస్థ పేర్కొంది. అదే సమయంలో చిన్న పారాచూట్‌లు, ప్రధాన పారాచూట్‌ల కోసం ఎయిర్‌క్రాఫ్ట్.. హెలికాప్టర్‌ల కోసం రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ ​​(RTRS) పరీక్షలను ఉపయోగించి ప్రతి పారాచూట్ పనితీరును సంక్లిష్టమైన పరీక్షా పద్ధతుల ద్వారా అంచనా వేయనున్నారు.

- Advertisement -

శనివారం జరిపిన ఓ పరీక్షలో ఒక ప్రధాన పారాచూట్ ఓపెన్​ కావడంలో విఫలమైనప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కనుగొన్నారు. పారాచూట్ సిస్టమ్ యొక్క వివిధ ఫెయిల్యూర్​ సిచ్యుయేషన్స్​ని పరిశీలించడానికి ఈ పరీక్ష జరిపారు.అందులో ఇది మొదటిదని శాస్త్రవేత్తలు తెలిపారు.  మొత్తం ఈ ప్రయోగం అంతా దాదాపు 2-3 నిమిషాల పాటు కొనసాగింది. పేలోడ్ ద్రవ్యరాశి నేలపై మెత్తగా ల్యాండ్ అయినందున మెయిన్ పారాచూట్‌లు పేలోడ్ వేగాన్ని ఈజీగా ల్యాండింగ్ వేగానికి తగ్గించాయని పరీక్షలో తేలింది.



Advertisement

తాజా వార్తలు

Advertisement