Friday, November 22, 2024

ఇస్రో శాస్త్రవేత్తలకు – మంత్రి​ పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు

పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లతుందని మంత్రి పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్న సందర్భంగా భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని మంత్రి అజయ్ కుమార్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం ఉదయం 5.59 గంటలకు వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి 18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది..పీఎ‌స్‌‌ఎ‌ల్‌‌వీ–సీ52 రాకెట్‌ 1710 కిలోల ఆర్బిట్‌ ఎర్త్‌ అబ్జర్వే‌షన్‌ శాటి‌లైట్‌ ఈఓ‌ఎ‌స్‌–04, 17.50 కిలోల ఐఎన్‌ఎస్‌-2డీటీ, 8.10 కిలోల బరువున్న ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈఓ‌ఎస్‌ అనేది రాడార్‌ ఇమే‌జింగ్‌ శాటి‌లైట్‌. దీన్ని వ్యవ‌సాయం, అటవీ సంర‌క్షణ, నేల తేమ, హైడ్రా‌లజీ, వర‌దల మ్యాపింగ్‌కు సంబం‌ధించి అన్ని వాతా‌వ‌రణ పరి‌స్థి‌తుల్లో హైక్వా‌లిటీ ఫొటో‌లను అందిం‌చేలా రూపొందించారు. ఐఎన్‌ఎస్‌-2డీ ఉపగ్రహాన్ని భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్‌ కోసం భారత్‌, భూటాన్‌ సంయుక్తంగా రూపొందించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement