సూళ్లూరుపేట(శ్రీహరికోట), ప్రభన్యూస్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేటి ఉదయం ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం3 (ఎల్‌వీఎం 3-ఎం3) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది… ఎల్‌వీఎం 3-ఎం3 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సిబ్బంది అభినందనలు తెలుపుకున్నారు. కాగా పూర్తి వాణిజ్య పరంగా చూపట్టే ఈ ప్రయోగంలో న్యూస్ స్పెస్ ఇండియా లిమిటెడ్, వన్‌వెబ్ ఒప్పందం ప్రకారం మొత్తం 108 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా గత ఏడాది అక్టోబర్ 23 జీఎస్‌ఎల్‌వీ -మార్క్ 3 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మరోమారు ఆదివారం ఉదయం 9గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం3 (ఎల్‌వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా విజయవంతంగా మరో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో..
Advertisement
తాజా వార్తలు
Advertisement