Saturday, November 23, 2024

రేపే పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రేపు పీఎస్ఎల్వీ సీ-52 ని పరీక్షించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ రోజు తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. రేపు(ఫిబ్రవరి 14) ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది.

పీఎస్ఎల్వీ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐఆర్ శాట్ 1ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు రూపొందించిన ఇన్ స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. PSLV-C52 భూ పరిశీలన ఉపగ్రహం (EOS-04) కక్ష్యలో 1710 కిలోల బరువుతో 529 కి.మీ సూర్య సింక్రోనస్ ధ్రువ కక్ష్యలోకి ప్రవేశించడానికి రూపొందించబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement