Tuesday, November 26, 2024

సవాళ్లను స్వీకరిస్తాం.. లాభాలు తెచ్చే ప్రోగ్రామ్స్ రూపొందిస్తాం: ఇస్రో న్యూ చీఫ్ సోమనాథ్

ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కొత్త చీఫ్ గా ఎస్. సోమనాథ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పలు అంశాలను పంచుకున్నారు. “ఆర్థికంగా లాభదాయకమైన కార్యక్రమాలు” చేపట్టడారిని అంతరిక్ష రంగంలో దేశానికి కొత్త ప్లేయర్స్ అవసరమని అన్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించి సవాలుగా మారిన అంశాలపై మరింత ఫోకస్ చేయాల్సిన  అవసరం ఉందన్నారు.

“మాకు కొత్త ప్లేయర్స్ వచ్చి ఆర్థికంగా లాభదాయకమైన అంతరిక్ష కార్యక్రమాన్ని రూపొందించాలి. మొత్తం అంతరిక్ష రంగం కోసం గణనీయమైన, సవాలుగా ఉన్నదాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అదే పనిని రకరకాల ఆకృతుల్లో చేస్తే మార్పు రావట్లేదు” అన్నారు సోమనాథ్. అసైన్‌మెంట్‌లు, సవాళ్ల గురించి మాట్లాడారు. జాతీయ అవసరాలను తీర్చే ప్రతి ఒక్కరికీ అంతరిక్ష కార్యక్రమం యొక్క ప్రయోజనాన్ని తీసుకురావాలని తాను ఉద్దేశించానని చెప్పారు. “నాకు, నాతో అనుబంధం ఉన్న వారందరికీ ఇది నిజంగా గర్వకారణం. ఈ అసైన్‌మెంట్‌తో నేను చాలా ఫ్రౌడ్ ఫీల్ అవుతున్నా. కొత్త సవాళ్ల కోసం ఎదురు చూస్తున్నా. అంతరిక్ష కార్యక్రమం యొక్క ప్రయోజనాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలని, జాతీయ అవసరాలను తీర్చాలని కోరుకుంటున్నా. అంతే కాకుండా దీన్ని మరింత విస్తరించి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి’’ అని సోమనాథ్ అన్నారు.

కేరళలోని తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్‌గా పనిచేసిన సోమనాథ్ GSLV Mk-III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ఏకీకరణకు టీమ్ లీడర్‌గా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement