Saturday, November 23, 2024

కులు-మనాలీలో తప్పిపోయిన ఇజ్రాయెల్​ ట్రెక్కర్​.. సేఫ్​గా తీసుకొచ్చిన అడ్వెంచర్​ అసోసియేషన్​

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, లాహౌల్-స్పితి జిల్లాల మధ్య హంప్టా పాస్ వద్ద ఓ ట్రెక్టర్​ కనిపించకుండా పోయాడు. అయితే అతనితో పాటు మరో ట్రెక్కర్​ తాము అనుకున్న ప్లేస్​కు చేరుకోగా ఈ ఇజ్రాయెల్​ ట్రెక్కర్​ మాత్రం రాలేదు. దీంతో అతను పోలీసులకు కంప్లెయింట్​ ఇచ్చాడు. దీంతో  తప్పిపోయిన ట్రెక్కర్​ని కనుగొనేందుకు అడ్వెంచర్​ టూర్స్​ ఆపరేటర్స్​ అసోసియేషన్​ మనాలికి చెందిన ఇద్దరు సబ్యులతో రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టింది. కాగా, వారు తప్పిపోయిన ఇజ్రాయెల్ ట్రెక్కర్ రాన్ (26) ని సోమవారం మధ్యాహ్నం  కనిపెట్టారు.

అయితే.. ఈ 26 ఏళ్ల ఇజ్రాయెల్​ ట్రెక్కర్ రాన్​.. మరో ట్రెక్కర్ యువన్ కోహన్ (24)తో కలిసి హంప్టా ట్రెక్‌ను దాటాల్సి ఉంది.  కోహన్ ఆదివారం మిడ్​నైట్​ లాహౌల్-స్పితి జిల్లాలోని కోక్సర్ ప్రాంతానికి చేరుకోగా, రాన్ మాత్రం ఆ ప్రాంతానికి ఇంకా రాలేదు. దీంతో అతను తప్పిపోయినట్టు గుర్తించి కనుగొనడానికి పోలీసులకు కంప్లెయింట్​ చేశాడు. అలర్ట్​ అయిన పోలీసులు అడ్వెంచర్ టూర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ తో రెస్క్యూ నిర్వహించారు.

కాగా, తప్పిపోయిన ట్రెక్కర్‌ను గుర్తించామని.. ప్రస్తుతం అతను క్యాంపులో సేఫ్​గానే ఉన్నాడని కులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గురుదేవ్ శర్మ తెలిపారు.  రాన్​, కోహన్​ కలిసి జూన్ 9న కులు జిల్లాలోని మనాలి నుండి హమ్తా టాప్ మీదుగా లాహౌల్-స్పితి జిల్లాలోని కోక్సర్ వైపు తమ పాదయాత్రను ప్రారంభించారని.. వారి ట్రెక్కింగ్​లో చిన్నపాటి అవరోధం కలిగిందన్నారు. ఇప్పుడు వారు సేఫ్​గా ఉన్నట్టు మీడియాకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement