Friday, November 22, 2024

ఇజ్రాయెల్ ప్రధానికి కరోనా : భారత పర్యటన వాయిదా

ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ భారత పర్యటన వాయిదా పడింది. ఆయన ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు ఇండియాలో పర్యటించేందుకు రాబోతున్నారని కొద్ది రోజుల ముందు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఆయన నిన్న కరోనా బారినపడ‌డంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే పర్యటన ఉండడంతో దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇండియాలోని ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి ముహమద్ హయీబ్ తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికయ్యాక నఫ్తాలీ బెన్నెట్ తొలిసారిగా భారత పర్యటనకు సిద్ధమైన ఈ సమయంలో ఆయన కరోనా బారినపడ్డారు. వాస్తవానికి ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ఆయన భారత్ లో పర్యటించాల్సి ఉంది. దీనిపై గత వారమే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటన గురించి ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మొదటిసారి భారత్ లో పర్యటించనున్నారని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement