Monday, November 18, 2024

ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధం… గాల్లోనే పేలుతున్న రాకెట్లు

ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ పై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు పాల్పతుండగా.. ఇజ్రాయిల్ గాజాపై వైమానిక దాడులు జరుపుతున్నది. డజన్ల కొద్దీ మెరుస్తున్న బుల్లెట్లతో ఆకాశమంతా సైరన్లు పేలుళ్ల మధ్య ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. వరుస రాకెట్లతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నా విధ్వంసం జరగకుండా ఇజ్రాయెల్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తోంది.

ఇరువర్గాల దాడులతో ఇప్పటి వరకు గాజాలో 65 మంది మృతి చెందగా.. ఇజ్రాయెల్‌లో ఏడుగురు మృతి చెందారు. గాజా స్ట్రిప్‌ పై భారీ బాంబుదాడులు కొనసాగుతున్నాయని, ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో సీనియర్‌ సభ్యులతో పాటు గాజా సిటీ కమాండ్‌ బస్సెం ఇస్సా మృతి చెందాడని హమాస్‌ ధ్రువీకరించింది. గాజాలో మరణించిన వారిలో 16 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా 65 పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 86 మంది పిల్లలు, 39 మంది మహిళలు సహా 365 మంది గాయపడ్డారని పేర్కొంది.

ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఇజ్రయెల్‌పై 180 ప్రయోగించారని, ఇందులో 40 గాజాలోనే పడిపోయాయని పేర్కొంది. హమాస్‌ దాడులకు ప్రతిగా ఐడీఎఫ్‌ గాజా ప్రాంతంలో 500 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపింది. హమాస్‌ సిబ్బంది, ఆయుధాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని బుధవారం రాత్రి వరకు 374 మందిని అరెస్టు చేసినట్లు సైన్యం తెలిపింది. ఈ ఘటనల్ల 36 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం రెండు పశ్చిమ ఆసియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు హమాస్‌ ఇజ్రాయెల్‌ వెయ్యికిపైగా రాకెట్లను ప్రయోగించగా.. ఇజ్రాయెల్‌ సైతం ధీటుగా దాడులకు పాల్పడుతోంది. 

ఇది కూడా చదవండి: దేశంలో 6-8 వారాల పాటు లాక్ డౌన్ విధించాల్సిందే: ఐసీఎంఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement