Thursday, November 21, 2024

కేరళ తీరంలో కొత్త దీవి.. ఎక్కడి నుంచి వచ్చింది?

కేరళ రాష్ట్రానికి సమీపంలో అరేబియా సముద్రంలో కొత్త ద్వీపం ప్రత్యక్షమైంది. ఇది తాజాగా గూగుల్ మ్యాప్స్ లో దర్శనమించింది. ఈ దీవి ఓ చిక్కుడు గింజ ఆకారంలో ఉంది. ఇది సుమారు 8 కిమీ పొడవు, 3 కిమీ వెడల్పుతో ఉన్నట్టు గూగుల్ మ్యాప్స్ ఆధారంగా అంచనా వేశారు. కొచ్చి తీరానికి ఇది కేవలం 7 కిమీ దూరంలోనే ఈ ద్వీపం ఉంది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందంటూ అందరూ అవాక్కయ్యారు.

గూగుల్ మ్యాప్స్ బ‌య‌ట‌పెట్టిన ఈ మిస్ట‌రీ ఐలాండ్‌పై ఇప్పుడు మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. అస‌లీ దీవి ఎలా ఏర్ప‌డింది? ఇది సముద్రం లోపల ఉందా? ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. రహస్య దీవిపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ అధికారులను ఆదేశించింది.

చెల్ల‌న‌మ్ క‌ర్షిక టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ అనే సంస్థ తొలిసారిగా ఈ మిస్టరీ దీవిని గుర్తించింది. ఈ నెల తొలివారంలోనే త‌మ ఫేస్‌బుక్ పేజీలో ఈ నిర్మాణం గురించి ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. అరేబియా స‌ముద్రంలో ఓ దీవిలాంటి నిర్మాణం క‌నిపిస్తున్న‌ట్లుగా గూగుల్ మ్యాప్స్ చూపిస్తోంద‌ని, కొచ్చి తీరానికి ఏడు కిలోమీట‌ర్ల దూరంలో గుర్తించామని, ఆ దీవి లాంటి నిర్మాణం పొడవు 8 కి.మీ. పొడ‌వు, 3.5 కి.మీ. వెడ‌ల్పుగా ఉందని, ఈ నిర్మాణాన్ని తాము గ‌త నాలుగేళ్లుగా చూస్తూనే ఉన్నామ‌ని చెల్ల‌న‌మ్ సంస్థ అధ్య‌క్షుడు కేఎక్స్ జూల‌ప్ప‌న్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement