Tuesday, November 26, 2024

ఇస్కాన్ ఆల‌యంపై ఉన్మాదుల దాడి – ముగ్గురికి గాయాలు

ఇస్కాన్ ఆల‌యంపై ఉన్మాద‌గుంపు తెగ‌బ‌డింది. సుమారు 150,200మందితో కూడిన ఇస్లామిక్ మూక్ ఇస్కాన్ దేవాల‌యాన్ని ముట్ట‌డించి దాడికి పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న బంగ్లాదేశ్ లోని ఢాకా లాల్మోహన్ సాహా స్ట్రీట్ లో చోటు చేసుకుంది. ఈ దాడికి 62 ఏళ్ల హాజీ షఫివుల్లా నేత్రుత్వం వహించాడు. ఆలయంలోని విగ్రహాన్ని అపవిత్రం చేయడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసింది. డబ్బు, ఇతర విలువైన వస్తువును దోచుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు భక్తులు సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహార్ హల్దార్ , రాజీవ్ భద్ర గాయపడ్డారు. దాడికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను వాయిస్ ఆఫ్ బంగ్లాదేవీ హిందు ట్విట్టర్ లో షేర్ చేసింది. గతంలో కూడా బంగ్లాదేశ్ లో ఇలాంటి ఘటనలే జరిగాయి. గతేడాది అక్టోబర్ లో ఇదే విధంగా కొంతమంది నోఖాలీ ప్రాంతంలో ఇస్కాన్ దేవాలయాన్ని తగబెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement