మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్‌పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వ పార్లమెంటరీ భాష ఇదేనా అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నిరసనకారులను పీఎం ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? అని ప్రశ్నించారు. యూపీ ముఖ్యమంత్రి చేసిన ’80-20′ ఓకేనా? అని అడిగారు. అంతేకాకుండా మహాత్మా గాంధీని బీజేపీ ఎంపీ కించపరిచిన తీరు బాగానే ఉందా.. ‘షూట్ సాలోంకో’ అని ఓ మంత్రి చెప్పడం సరైందేనా అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. రైతు నిరసనకారులను ఉగ్రవాదులని అవమానించారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ సరైనవేనా అని ట్విటర్ వేదికగా.. మోదీని కేటీఆర్ ప్రశ్నించారు.
- Advertisement -