బీజేపీ అధికార ప్రతినిధి ఒక ఆమె మాట్లాడిన తీరుకు యావత్ దేశం మొత్తం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. విదేశాల్లో రాయబారులు పిలిచి సారీ చెప్పించుకున్నరు. మీ పనికిమాలిన తనం, మీ నోటి దూలతోటి దేశంలో చిచ్చుపెట్టిస్తరా? అని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లీడర్ల తీరుపై మండిపడ్డారు. ఇవ్వాల సాయంత్రం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పనికిమాలిన తనం, చాతకాని తనంతో బీజేపీ బట్టలిప్పి బజార్లో నాట్యం చేస్తున్నట్టు వ్యవహరిస్తోందన్నారు సీఎం కేసీఆర్.
బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడిన తీరుపై సుప్రీంకోర్టు తప్పుపట్టి తప్పకుండా క్షమాపణ చెప్పాలని అంటే.. కొంతమంది రిటైర్డ్ జడ్జీలను తీసుకొచ్చి సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖ దాటిందని ట్రోలింగ్ చేపిస్తరా? ఇదేనా మీకు చట్టాలమీద ఉన్న గౌరవం, నమ్మకం అని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ తీరును కడిగిపడేశారు సీఎం కేసీఆర్.