బారత ప్రజలకు కేంద్ర చేస్తున్న దుర్మార్గాలను తెలియజేస్తూ… కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పేరిట పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సాగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదు రోజులు పూర్తయ్యాయి. ఇవ్వాల (సోమవారం) ఆరో రోజు యాత్ర కొనసాగనుంది. ఇక.. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి చెందిన పలు అంశాలపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశం కోసం తన కుటుంబంలోని పెద్దలందరినీ కోల్పోయిన వీరుడని.. వారి కుటుంబం దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిందని కొంతమంది కొనియాడుతుంటే.. ఇంకొంతమంది రాహుల్ గాంధీ టీషర్టు ధర ఇంత అంటూ వ్యక్తి గత అంశాలపై ఛీప్ కామెంట్స్ చేస్తున్నారు. ఇట్లాంటి ఛీప్ కామెంట్స్ చేసిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్షా వంటి వారు కూడా ఉన్నారు. అంతేకాకుండా అతనికి ధైర్యం లేదని విమర్శలు చేసిన వారికి సమాధానంగా సముద్రంలో ఒంటరిగా దూకిన వీడియో ఒకటి షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.