ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటేస్ట్ సినిమా పుష్ప థియేటర్లలో సందడి చేస్తోంది. బన్నీ, సుకుమార్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.173 కోట్లుపైగా గ్రాస్ సాధించింది. కరోనా సమయంలోనూ గతంలోని రికార్డులన్నింటినీ ‘పుష్ప’ బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది.
అయితే థియేటర్లలో ఈ మూవీ హవా కొనసాగుతుండగానే ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ పుష్ప మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప-ది రైజ్’ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రైమ్‌లో రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీం స్పందించింది. ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మరోవైపు అధికారిక OTT విడుదల తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, ఈ చిత్రం OTTలో 2022 జనవరి చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
కాగా, పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఆప్రభవం సినిమా కలెక్షన్ పై మాత్రం పడలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్. మునుపెన్నడూ చూడని పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మళయాల నటుడు ఫాహద్ పాజిల్ విలన్‌గా కనిపించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital