కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 2జీ కుంభకోణంపై బీజేపీ లీడర్లు ఎన్నో ఆరోపణలు చేశారు. వాస్తవమే కుంభకోణం జరిగి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 5జీ స్పెక్ట్రం కూడా ఓ కుంభకోణం కాదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మీరు అప్పుడు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? అని నిలదీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం 5లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తే.. స్పెక్ట్రం వేలంలో 1.50 లక్షల కోట్లు మాత్రమే వస్తాయా? దీని పర్యవసానం ఏమిటి? ఎవరు ఎవరికి మేళ్లు చేస్తున్నారో దేశమంతా చూస్తోంది. ఇదో పెద్ద కుంభకోణం.. ఎప్పటికైనా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
అదేవిధంగా జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం తన ధోరణి మార్చుకోవాలని, పాలు, ఆహార పదార్థాలు, శ్మశాన వాటికలు, చేనేత వంటి పేదలకు ఉపయోగపడే వాటిమీద జీఎస్టీని మొత్తానికే తొలగించాలని డిమాండ్ చేశారు.