కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మరో జట్టు రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో నెగ్గి, ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ కు ఘనమైన నివాళి అర్పించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు పట్టుదలతో ఉంది. కాగా ఐపీఎల్ ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..ఏఆర్ రెహమాన్..స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పాల్గొననున్నారు. ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం 45 నిమిషాల పాటుఓ కార్యక్రమానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇందులో పాల్గొననున్నారు. అలాగే, జార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఛౌ డ్యాన్స్ కూడా ఉంటుందట. ఇందుకోసం బీసీసీఐ 10 మంది సభ్యుల జార్ఖండ్ ఛౌ డాన్స్ బృందాన్ని ఖరారు చేశారట. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా, టీమిండియా మాజీ కెప్టెన్లు ముగింపు వేడుకకు హాజరుకానున్నారు. 2019 సీజన్ నుంచి ఐపీఎల్ ముగింపు వేడుక ఇప్పటి వరకు సాధ్యపడలేదు.
ముగింపు దశకి చేరుకున్న ఐపీఎల్ – సందడి చేయనున్న ఏఆర్ రెహమాన్..రణ్ వీర్ సింగ్
Advertisement
తాజా వార్తలు
Advertisement