ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఇంటర్ స్టేట్ బెట్టింగ్ గ్యాంగ్‌ను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పెద్దయెత్తున బెట్టింగ్‌కు పాల్పడుతోందన్న సమాచారం మేరకు బెట్టింగ్ ముఠా స్థావరంపై ఎస్‌ఓటీ శంషాబాద్, ఎస్‌ఓటీ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో నగదు, మొబై ల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు.
ఎస్‌ఓటీ పోలీసుల దాడిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నవ్యక్తుల నుంచి రూ. 1.84 కోట్ల నగదు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యాప్స్ ఉపయోగించి బెట్టింగ్‌లకు ఈ ముఠా పాల్పడుతోందని, వజ్ర 777, వజ్ర ఎక్స్చేంజి, మెట్రో వజ్ర ఎక్స్చ్‌ంజ్ తదితర యాప్స్ వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్టు చేశామని, మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. బెట్టింగ్ ముఠాలను సహించే ప్రసక్తిలేదని, అక్రమంగా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.