Tuesday, November 19, 2024

మొదలైన మెగావేలం.. రెండురోజులపాటు సందడే సందడి..

ఐపీఎల్‌ 2022 మెగావేలం సంద‌డి షురూ అయింది.. శనివారం, ఆదివారం రెండురోజులపాటు వేలం జరగనుంది. నేటి ఉదయం 11గంటలకు ప్రారంభ‌మైన వేలం సాయంత్రం 6గంటల వరకూ వేలం ఉంటుంది. ఈ మెగావేలానికి పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం అత్యధికంగా 72కోట్ల రూపాయలతో ప్లేయ‌ర్ల‌ను కొన‌డానికి వ‌చ్చారు. పంజాబ్‌కింగ్స్‌ తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 68కోట్ల రూపాయలతో వేలంబరిలో దిగింది. పంజాబ్‌కింగ్స్‌ వేలానికి ముందు ఇద్దరు ఆటగాళ్లును మాత్రమే రిటెన్షన్‌ జాబితాలో ఉంచుకుంది. సన్‌రైజర్స్‌ మాత్రం ముగ్గురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. మూడోస్థానంలో లక్నో సూపర్‌జెయింట్స్‌ 59కోట్ల రూపాయలతో వేలానికి సిద్ధమైంది. ఆ తర్వాత నాలుగోస్థానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ.57కోట్లు, ఐదోస్థానంలో అహ్మదాబాద్‌ టైటాన్స్‌ రూ.52కోట్లు, ఆరోస్థానంలో రూ.48కోట్లుతో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఉన్నాయి. కాగా ఢిల్లి క్యాపిటల్స్‌ వెలానికి ముందు నలుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుని వేలానికి రూ.47.5కోట్లతో మిగిలిన ఫ్రాంచైజీలకంటే తక్కువ మొత్తంతో వేలానికి సిద్ధమైపోయారు.

కాగా ఒక్కో జట్టు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రూ.90కోట్లు వెచ్చించే అవకాశం ఉండ‌నుంది. ఈరోజు రేపు జరిగే ఈ మెగావేలంలో 590మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 370మంది భారత్‌కు చెందిన ప్లేయర్స్ ఉండ‌గా.. 220మంది విదేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. మెగావేలానికి 1200మందికిపైగా ఆటగాళ్లు తమ పేర్లును రిజిస్టర్‌ చేసుకున్నా..అయితే బీసీసీఐ 590మందిని మాత్రమే వేలానికి ఎంపిక చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement