కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఉంటాడని టీమ్ యాజమాన్యం బుధవారం అధికారిక ప్రకటన చేసింది. దీనిపై శ్రేయస్ మాట్లాడుతూ..”కేకేఆర్ సారథిగా బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను. వివిధ దేశాల ఆటగాళ్లు ఉండే జట్టును నడిపించడం గొప్ప అవకాశం. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఒకే చోటుకు చేర్చడం ఐపీఎల్ ప్రత్యేకత. నాకు ఈ అవకాశాన్నిచ్చిన కేకేఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు. సమష్టిగా రాణించి మా జట్టుకు విజయాలు అందిస్తాం’ అని అన్నాడు. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన శ్రేయస్‌ను ఈ సారి మెగా వేలంలో కోల్‌కతా జట్టు సొంతం చేసుకుంది. ఇతని కోసం రూ. 15.25 కోట్లు కేటాయించింది.
కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయస్ నియామకంపై కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మాట్లాడుతూ.. “మంచి భవిష్యత్తు ఉన్న భారత ఆటగాడు మా జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ఆనందంగా ఉన్నాం. శ్రేయస్ ఆట, కెప్టెన్ స్కిల్స్‌ను నేను చాలా ఎంజాయ్ చేస్తాను. శ్రేయస్‌తో కలిసి పనిచేసి కేకేఆర్‌కు విజయాన్ని అందిస్తాం” అని పేర్కొన్నాడు. రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్‌కు ఇది సరికొత్త ప్రారంభం కానుందని, శ్రేయాస్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. ‘ఇండియన్ ఫ్యూచర్ కెప్టెన్స్‌లో ఒకరైన శ్రేయాస్ అయ్యర్, KKRలో పగ్గాలు చేపట్టినందుకు చాలా సంతోషిస్తున్నా. శ్రేయాస్ ఆటను, అతని కెప్టెన్సీ నైపుణ్యాలను చాలా దూరం నుంచి ఆస్వాదించా. ఇప్పుడు KKRలో కావలసిన విజయాన్ని, ఆట శైలిని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నా” అని మెకల్లమ్ వివరించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital