Friday, November 22, 2024

ఫైనల్‌కు కోల్‌కతా

  • ఢిల్లీపై ఉత్కంఠ భరిత విజయం – అర్ధ శతకంతో మెరిసిన వెంకటేష్‌ – అయ్యర్‌ శ్రీ బంతి మిగిలి ఉండగానే గెలుపు
    – చేతులెత్తేసిన కోల్‌కతా మిడిల్‌ ఆర్డర్‌ – వరుసగా నలుగురు డకౌట్‌ – సిక్స కొట్టి గెలిపించిన రాహుల్‌ త్రిపాఠి

  • నరాలు తెగే ఉత్కంఠలో ఐపీఎల్‌ ఫైనల్‌కు కోల్‌కతా దూసుకెళ్లింది. ఢిల్లిసపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లిస జట్టు 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు.. గిల్‌ (46), వెంకటేష్‌ అయ్యర్‌ (55) అత్యద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అప్పటి వరకు వార్‌ వన్‌ సైడ్‌గా కొనసాగిన మ్యాచ్‌.. గిల్‌, వెంకటేష్‌ అయ్యర్లు ఔటవ్వడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. 2 బంతుల్లో 6పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో రాహుల్‌ త్రిపాఠి సిక్స్‌ కొట్టి కోల్‌కతాను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
    షార్జా : కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్పిన్నర్లు మరోసారి చెలరేగడంతో ఢిల్లిస క్యాపిటల్స్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లిస, ప్రత్యర్థి ముందు 136 పరుగుల స్వ ల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లిస నిర్ణీత 20 ఓవర్స్‌లో 5 వికెట్లకు 135 పరు గులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (30 నాటౌట్‌), శిఖర్‌ ధావన్‌ (36) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్‌ బౌల ర్లలో వరుణ్‌ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. ఫెర్గుసన్‌, శివం మావి తలో వికెట్‌ పడగొట్టారు. ఢిల్లిసకి ధావన్‌, షా ధనాధన్‌ బ్యాటింగ్‌తో శుభారంభం ఇచ్చారు. షకీబ్‌ వేసిన తొలి ఓవర్‌లో సింగిల్‌ మాత్రమే తీసిన ఈ జోడీ.. ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో బౌండరీతో 5 పరుగులు మాత్రమే చేసింది. స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించిన ఈ జోడీ.. 4 ఓవర్లు ముగిసేసరికి 32 పరుగులు చేసింది.
    రాణించిన ధావన్‌
    వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో పృథ్వీ షా (18) ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లిస పతనం ప్రారంభమైంది. క్రీజులోకి స్టోయినిస్‌ వచ్చాడు. పవర్‌ ప్లేలో ఢిల్లిస ఒక వికెట్‌ నష్టానికి 38 పరుగులు చేసింది. ఆ తరువాత కోల్‌కతా బౌలర్లు.. ఢిల్లిస బ్యాటర్లను కట్టడి చేశారు. ఒత్తిడికి గురైన స్టోయినిస్‌ (18) భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి.. శివం బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన అయ్యర్‌ కొంత తడబడ్డాడు. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన ధావన్‌ (36) కూడా.. వరుణ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటై పెవిలియన్‌ చేరుకున్నా డు. వస్తూనే బౌండరీ బాదిన పంత్‌.. (6) భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి.. క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ తరు వాత క్రీజులోకి వచ్చిన హెట్‌మేయర్‌ వరుణ్‌ వేసిన 17వ ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు సూపర్‌ క్యాచ్‌కు ఔట య్యాడు. అయితే ఆ బంతి నో బాల్‌ కావడంతో మైదా నం వీడిన హెట్‌మేయర్‌.. మళ్లిస బ్యాటింగ్‌కు వచ్చి.. ఫెర్గునస్‌ వేసిన 18వ ఓవర్‌లో 2 సిక్సులు బాదాడు. నరైన్‌ వేసిన 19వ ఓవర్‌లో హెట్‌మేయర్‌ (17) రనౌట్‌ అయ్యాడు. ఢిల్లిస 20 ఓవర్స్‌లో 135 పరుగులు చేసింది.
    అయ్యర్‌ అద్భుత ఇన్నింగ్స్‌
    136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా సేన అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఓపెనర్‌లుగా వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌్‌ అయ్యర్‌లు రెచ్చిపో యారు. భారీ భాగస్వామ్యాన్ని కోల్‌కతా జోడి అందిం చింది. ఢిల్లిస బౌలర్లను వెంకటేశ్‌ అయ్యర్‌ ఉతికి ఆరేశా డు. తొలి వికెట్‌కు 96 పరుగుల భారీ పార్టనర్‌ షిప్‌తో విజయానికి గట్టి పునాది వేశారు. శుభ్‌మన్‌ గిల్‌ ఆచి తూచి ఆడుతూ.. అయ్యర్‌కు స్ట్రయిక్‌ ఇస్తూ వెళ్లాడు. దీంతో వెంకటేష్‌ అయ్యర్‌ ఆకాశమే హద్దుగా రెచ్చి పోయాడు. దీంతో కేకేఆర్‌ జట్టు పవర్‌ ప్లే ఓవర్స్‌లో ఒక్క వికెట్‌ కూడా నష్టోకుండా 51 పరుగులు చేసింది. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సులు బాదు తూ.. 38 బంతుల్లో అయ్యర్‌ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రబాడా వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ 2వ బంతికి అయ్యర్‌ (55) ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చి న నితీష్‌ రాణా కూడా బ్యాట్‌కు పని చెప్పాడు. అయితే నోర్టే ్జ బౌలింగ్‌లో రానా (13) ఔటయ్యాడు. క్రీజులో నిల దొక్కుకున్న శుభ్‌మన్‌ గిల్‌ (46)ను అవేష్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. ఆ తరువాత వచ్చిన దినేష్‌ కార్తీక్‌, మోర్గాన్‌, షకిబ్‌ ఉల్‌ హసన్‌, సునీల్‌ నరైన్‌లు డకౌట్‌లుగా వెను దిరిగారు. ఒక్క బంతి మిగిలి ఉండానే.. రాహుల్‌ త్రిపాఠి సిక్స్‌ కొట్టి కోల్‌కతాకు విజయం తెచ్చిపెట్టాడు. నోర్టే ్జ, అశ్విన్‌, రబాడాకు రెండేసి వికెట్లు దొరికాయి. అవేష్‌ ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కింది.
    ఢిల్లిd క్యాపిటల్స్‌ : పృథ్వీ షా (ఎల్‌బీడబ్ల్యూ) (బి) చక్రవర్తి 18; ధావన్‌ (బి) చక్రవర్తి (సి) షకిబ్‌ 36; స్టోనిస్‌ (బి) శివం మావి 18; శ్రేయస్‌ అయ్య ర్‌ (నాటౌట్‌) 30; పంత్‌ (బి) ఫెర్గుసన్‌ (బి) త్రిపాఠి 6; హెట్‌మేయర్‌ (రనౌట్‌) (వెంకటేష్‌ అయ్యర్‌/కార్తిక్‌) 17; అక్షర్‌ (నాటౌట్‌) 4. ఎక్స్‌ట్రాలు : 6. మొత్తం 20 ఓవ ర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు. వికెట్ల పతనం : 1-32, 2-71, 3-83, 4-90, 5-117. బౌలింగ్‌ : షకిబ్‌ 4-0-28-0, ఫెర్గుసన్‌ 4-0-26-1, నరైన్‌ 4-0-27-0, చక్రవర్తి 4-0-26-2, శివం మావి 4-0-27-1.
    కోల్‌కతా ఇన్నింగ్స్‌ : శుభ్‌మన్‌ గిల్‌ (బి) అవేష్‌ ఖాన్‌ (సి) పంత్‌ 46; వెంకటేష్‌ అయ్యర్‌ (బి) రబాడా (సి) స్టీవ్‌ స్మిత్‌ 55; నితీష్‌ రానా (బి) నోర్టే ్జ (సి) హెట్‌మేయర్‌ 13; రాహుల్‌ త్రిపాఠి (నాటౌట్‌) 30; దినేష్‌ కార్తిక్‌ (బి) రబాడా 0; మోర్గాన్‌ (బి) నోర్ట్జే 0; షకిబ్‌ అల్‌ హసన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 0; నరైన్‌ (బి) అశ్విన్‌ (సి) 0; అక్షర్‌ (నాటౌట్‌) 0. ఎక్స్‌ట్రాలు 10. మొత్తం : 19.5 ఓవర్స్‌లో 136 పరుగులు. వికెట్ల పతనం : 1-96, 2-123, 3-125, 4-126 5-129, 6-130, 7-130. బౌలింగ్‌ : నొర్టే ్జ 4-0-31-2, అశ్విన్‌ 3.5-0-27-2, అవేష్‌ ఖాన్‌ 4-0-22-1, అక్షర్‌ పటేల్‌ 4-0-32-0, రబాడా 4-0-23-2.
Advertisement

తాజా వార్తలు

Advertisement