– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
iOS కోసం WhatsApp ఇప్పుడు క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డ్ చేసే ఫెసిలిటీని అందిస్తోంది. యూజర్లు వీడియోలు, ఫొటోలు, GIFలు, డాక్యుమెంట్లను ఇకమీదట క్యాప్షన్‌ని యాడ్ చేసి షేర్ చేయవచ్చు. అంతేకాకుండా వాటిని డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఐఫోన్ వినియోగదారులు ఇప్పుడు iOS (22.23.77) అప్‌డేట్‌లో కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చని WABetaInfo పేర్కొంది. కొత్త ఫీచర్‌తో పాటు, క్యాప్షన్ నుండి సంబంధిత పదబంధాలను టైప్ చేయడం ద్వారా వినియోగదారులు పాత మీడియా కోసం ఈజీగా సెర్చ్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది.
ఇక.. యూజర్లు వివిధ రకాల మీడియా ఫైల్‌లతో క్యాప్షన్‌లను షేర్ చేసినప్పుడు స్క్రీన్ దిగువన కొత్త వ్యూని గమనించవచ్చు. ‘dismiss’ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా ఇతరులకు ఫార్వార్డ్ చేసే ముందు క్యాప్షన్‌ను తీసివేయడానికి యూజర్లకు చాన్స్ కూడా ఉంటుంది. “Message Yourself” అనే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఇది వినియోగదారులకు ఈజీగా సమాచారాన్ని, సందేశాన్ని షేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.