ఐఫోన్లపై ఆఫర్ల వర్షం కురుస్తోంది.. మీరు కనుక స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే Amazonలో బెస్ట్ డీల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి.. ఐఫోన్ 11ని అమెజాన్‌లో రూ.4000 తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ డీల్‌ను మరింత తగ్గించడానికి అమెజాన్ కూడా రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ని ప్రకటించింది. కాగా, ఐఫోన్ 11 2019 సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది.
ఐఫోన్ 11, 64GB వేరియంట్ కోసం 68,300కు ఇండియాలో అమ్ముతోంది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ.49,900కి లభిస్తోంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్ పై రూ. 4000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. ఇంకా, కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌కు బదులుగా రూ. 15,000 వరకు ఎక్చేంజ్ పొందవచ్చు. దీంతో ధర కాస్త రూ.31,000కు తగ్గనుంది. మీ పాత ఫోన్ యొక్క ఎక్స్ఛేంజ్ విలువ ఫోన్ పరిస్థితి, ఫోన్ తయారు చేసిన సంవత్సరంపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. స్మార్ట్ ఫోన్ పరిస్థితి బాగుంటే కనుక ఇంకాస్త బెస్ట్ ప్రైస్‌ని పొందే చాన్స్ ఉంటుంది.
ఉదాహరణకు.. మీరు మీ iPhone XR 64GB ఫోన్‌ని ఎక్చేంజ్ చేయాలనుకుంటే.. రూ. 12,000 వరకు పొందవచ్చు. అదేవిధంగా మీ పాత iPhone 11ని చేంజ్ చేసి, కొత్త ఫోన్ కొనాలనుకుంటే బెస్ట్ ప్రైజ్ లభిస్తుంది.
Flipkart కూడా iPhone 11 కోసం ఇదే విధమైన డీల్‌ను అందిస్తోంది. Walmart యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లాట్ తగ్గింపును అందించనప్పటికీ ఇది రూ. 18,850 ఎక్చేంజ్ ఆఫర్‌ని అందిస్తోంది. తద్వారా ధర కూడా రూ.31,000కి తగ్గే చాన్స్ ఉంటుంది.
ఐఫోన్ 11 ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్లలో ఒకటి. మొదటిసారి ఐఫోన్ కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే.. మీరు iPhone 11ని కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
స్మార్ట్ ఫోన్ 120Hz డిస్ప్లేతో రాదు. 5Gకి సపోర్ట్ చేయదు అన్న విషయం గమనించాలి. కానీ, ఇక్కడో క్వశ్చన్ ఏంటంటే.. నిజంగా 5G నెట్వర్క్, అధిక రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లే అవసరమా ? అన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఐఫోన్ 12ని కొనుగోలు చేయడం వల్ల ఫ్యూచర్లో బెటర్‌గా ఉంటుంది. కాగా, ఇండియాలో 5G నెట్వర్క్ రావడానికి ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చని తెలుస్తోంది. కనీసం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఐఫోన్ కొనాలనుకుంటే మట్టుకు 2021లో వచ్చిన ఐఫోన్ 11 ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. బడ్జెట్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫోన్‌కి ఆపిల్ నుంచి 2025వరకు అప్డేట్స్ వస్తాయన్న విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి.