Saturday, November 23, 2024

Investors Hub – గ్లోబ‌ల్ కంపెనీలు – కేరాఫ్ తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన విజయ వంతంగా ముగిసింది. రెండు వారాల పాటు దాదాపు 80కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. యూకే, యూఎస్‌లో పెట్టు బడులను రాబట్టడంలో సక్సెస్‌ అయ్యారు. న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌, హెండర్సన్‌, బోస్టన్‌తో పాటు లండన్‌లలో పేరొందిన ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులను పెడుతున్నట్లుగా ప్రకటించారు. సుమారు 42,000 కొత్త ఉద్యోగాలను కల్పించేలా కృషి చేశారు. బ్యాం కింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, ఐటీ, ఐటీఈఎస్‌, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైసెస్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌, డేటా సెంటర్లు, ఆటోమోటివ్‌, పర్యావరణ రహిత వాహనాలతో పాటు పలు రంగాల్లో పెట్టుబడులను పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. తెలంగాణలో తమ కంపెనీల విస్తరణలో భాగం గా పెట్టుబడులను పెట్టేందుకు గ్లోబల్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి. మీడియా రంగంలో పేరొందిన సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ ముందుకు
వచ్చింది. విస్తరణను ప్రకటించింది. మెడ్‌ట్రానిక్‌ హెల్త్‌ కేర్‌, టెక్నాలజీలో గ్లోబల్‌ లీడర్‌గా ఉంది. స్టేట్‌ స్ట్రీట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటి. బెయిన్‌ క్యాపిటల్‌ వీఎక్స్‌ఐ కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులను వెల్లడించింది. స్పోర్ట్స లైవ్‌ స్ట్రీమింగ్‌లో పేరొందిన డీఏజెడ్‌ఎన్‌, ఫ్రెంచ్‌ అమెరికన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ దిగ్గజ సంస్థ టెక్నిక్‌ ఎఫ్‌ఎమ్‌సీ నగరానికి రాబోతున్నాయి. ఫైనాన్షియల్‌ రంగంలో ఏలియంట్‌ గ్రూప్‌ ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ కూడా హైదరాబాద్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహించనున్ననట్లుగా వెల్లడించింది. పలు సంస్థలు నగరం కేంద్రంగా వాటి విస్తరణను ప్రకటించాయి. మంత్రి కేటీఆర్‌తో చర్చల అనంతరం ఆయా కంపెనీలు పెట్టుబడులపై ప్రణాళికలను వెల్లడించాయి. విదేశీ పర్యటనతో తెలంగాణకు పలు కంపెనీలు తీసుకురావడంలో మంత్రి కేటీఆర్‌ విజయవంతం అయ్యారని భారాస నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ మోడల్‌ విశ్వవ్యాప్తం
విదేశీ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ రెండు ప్రధాన సదస్సులకు హాజరయ్యారు. లండన్‌లో జరిగిన ఐడియాస్‌ ఫర్‌ ఇండియా సదస్సులో తెలంగాణ మోడల్‌ను వివరించి ఆకట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ సంక్షేమ పథకాలు, అమలు చేయాల్సిన అవసరాలపై నొక్కి చెప్పారు. మే 22న హెండర్సన్‌లో అమెరికా సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ నిర్వహించిన ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో మంత్రి కేటీఆర్‌ కీలక ఉపన్యాసం ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ ప్రధాన నీటి వనరులు, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ విజయాలను ప్రదర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సివిల్‌ ఇంజనీర్ల సంఘం నుంచి ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్సెస్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ బిరుదుతో గౌరవించింది.

చిన్న పట్టణాలకు ఐటీ కంపెనీలు
తన పర్యటనలో మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా పలు సమావేశాల్లో ప్రయత్నించారు. వరంగల్‌, నల్గొండతో పాటు పలు చిన్న పట్టణాల్లో ఐటీ విస్తరణకు మార్గం వేశారు. ఇప్పటికే పలు కంపెనీలు ఆయా జిల్లాల్లో పెట్టుబడులను పెట్టనున్నట్లుగా ప్రకటించాయి. 30కి పైగా కంపెనీల సీఈవోలతో టైర్‌ 2 పట్టణాల్లో పెట్టుబడులపై చర్చించి ఒప్పించ గలిగారు. ఇక్కడి మౌళిక వసతులు, ప్రభుత్వ విధానాలను వివరించడంలో సక్సెస్‌ అయ్యారు. కరీంనగర్‌లో ఆపరేషన్‌ సెంటర్‌, వరంగల్‌లో రైట్‌ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు రానున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. పలు కంపెనీలు ఇంకా భవిష్యత్తులోనూ విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాయి.

తన పర్యటనను విజయవంతం చేసినందుకు ఎన్నారైలు, పార్టీ శ్రేణులు, ప్రవాస భారతీయులకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెంట వెళ్లిన ప్రతినిధుల బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా వింగ్‌ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈవో శక్తి ఏం నాగప్పన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement