Friday, November 22, 2024

Crime | అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ఏపీకి చెందిన ఇద్దరి అరెస్టు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: నకిలీ నోట్లు ముద్రించి ఏపీ , తెలంగాణల్లో చెలామణి చేస్తున్న ఏపీకి చెందిన నకిలీ కరెన్సీ ముఠాను శంషాబాద్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సిపట్నంకు చెందిన టి రంజిత్‌సింగ్‌ , అదే జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన ఎం మోహన్‌ రావుతో కలిసి శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఒక హోటల్‌లో బసచేసి నకిలీ నోట్లు ముద్రిస్తున్నారన్న సమాచారం మేరకు ఏసీపీ భాస్కర్‌ వేముల, సీఐ శ్రీధర్‌ బాబు, ఎస్‌ఓటీ ఇన్స్‌పెక్టర్లు బి సత్యనారాయణ బృందం దాడి జరిపి నిందితులను పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి రూ. 8,55,000 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా సభ్యులు ు ఏజెంట్లను ఇంస్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ ద్వారా సంప్రదించి కర్నాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో చెలామణి చేస్తున్నట్లు శంషాబాద్‌ జోన్‌ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. కూరగాయల మార్కెట్‌, చిరువ్యాపారులు, పండ్ల మార్కెట్‌ ,రైతు బజార్లలో రాత్రుల్లో నకిలీ కరెన్సీని అసలు కరెన్సీతో కలిపి చెలామణి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్‌ సిబ్బందిని ఆయన అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement